ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 8:21 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

గుంజపాడుగ గ్రామసభ.. ఉచిత న్యాయ సేవలపై అవగాహన ,న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవలను వివరించిన పారా లీగల్ వాలంటీరీ.

గుంజపాడుగ గ్రామసభ.. ఉచిత న్యాయ సేవలపై అవగాహన ,న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవలను వివరించిన పారా లీగల్ వాలంటీరీ.

గుంజపడుగ . అర్జున్ సమాచారం ప్రతినిధి .మంథని:ఆగస్టు 2 .

గ్రామంలోని రైతు వేదికలో సర్పంచ్ సంధ్య అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల, జిల్లా స్థాయిలో అందుబాటులో ఉన్న న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సలహాలు, న్యాయ సహాయం పొందే అవకాశం గురించి పారా లీగల్ వాలంటీర్ ఎల్కా సదానందం గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

పేదలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు తదితర అర్హులైన వారికి న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందుబాటులో ఉండే వివిధ న్యాయ సహాయ సేవల గురించి వివరించారు. అవసరమైన సందర్భాల్లో న్యాయ సహాయం కోసం సంబంధిత న్యాయ సేవా సంస్థలను సంప్రదించాలని సూచించారు.

ఈ గ్రామసభలో సర్పంచ్ సంధ్య, ఉపసర్పంచ్ లక్ష్మి, వార్డు సభ్యులు సుజాత, కళ్యాణ్, సుమలత, లక్ష్మి, పోశం ఓదేలు, సంపత్, శంకర్, గ్రామ కార్యదర్శి సతీష్, ఎఫ్‌ఏ రమాదేవి, ఏఈఓ మురళి, ఏఎన్‌ఎం పద్మ, ఎల్‌పీ స్టాఫ్ వైష్ణవి, సీయాలు రాధా, భూలక్ష్మి, ఆశా కార్యకర్తలు, నాయకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గ్రామస్థులకు న్యాయ సేవలపై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.